మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ వద్ద ఉన్న రాయల్ డీలక్స్ హాస్టల్ యజమాని వికృత చర్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలో గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు.
గండిమైసమ్మ వద్ద ఉన్న రాయల్ డీలక్స్ హాస్టల్లో వెంకట రామకృష్ణ (52) నాలుగు నెలలుగా పని చేస్తున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్రలో ఉన్న గుమస్తాపై యజమాని శేఖర్ నీళ్లు పోసి... పని చేయాలంటూ దుర్భాషాలాడాడు. రామకృష్ణ తన ఆరోగ్యం మంచిగా లేనందున చేయనని చెప్పాడు. దీంతో యజమాని శేఖర్ గుమస్తాను కర్రతో చితకబాదాడు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి.. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.