హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో.. కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ బస్తీలో ఓ యువతి అపహరణకు గురైనట్లు.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 3 బైక్‌లపై వచ్చిన దుండగులు.. 'హెల్ప్ హెల్ప్' అంటూ కేకలు వేస్తున్న యువతిని బలవంతంగా తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అసలు కిడ్నాప్‌కు గురైన యువతి.. ఎవరై ఉంటారనే వివరాలను ఆరా తీస్తున్నారు. తెలిసిన వాళ్లే బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారా..? మిస్సింగ్ కేసులేవైనా నమోదయ్యాయ.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త!