ETV Bharat / crime

ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి - ట్రాక్టర్ కింద పడి మృతి

అప్పటివరకు తండ్రితో సంతోషంగా గడిపిన కొడుకు ఒక్కసారిగా మృత్యుఒడిని చేరాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఎర్రపహడ్​లో జరిగింది.

tractor accident, errapahad, suryapet
tractor accident, errapahad, suryapet
author img

By

Published : May 7, 2021, 10:51 PM IST

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని ఎర్రపహడ్​లో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన లింగాల యాకస్వామి కుమారుడు సాయి సిద్ధార్థ(12) తండ్రితో పాటు ట్రాక్టర్​మీద కూర్చున్నాడు. ట్రాక్టర్ నుంచి గడ్డిని దించుతున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్టర్ వెనుకకు కదలడంతో.. ఇంజన్​పై కూర్చున్న బాలుడు కిందపడ్డాడు. అతనిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

అప్పటి వరకు హుషారుగా మాట్లాడుతూ ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృత్యుఒడిలోకి చేరడంతో.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. .

ఇదీ చూడండి: వామన్​రావు దంపతుల హత్యపై మాట్లాడుకున్న ఇద్దరిపై పోలీసుల చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.