రంగారెడ్డి జిల్లా కర్ణంగూడ కాల్పుల కేసులో నిందితులను.. కాసేపట్లో ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. హంతకులతో మట్టారెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ఇద్దరికి వెయ్యి111 గజాల భూమి ఇస్తానన్న మట్టారెడ్డి చెప్పినట్లు దర్యాప్తులో తేల్చారు. ప్లాట్ ఏ ప్రాంతంలో ఇస్తారన్న దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
హత్య కేసులో లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రమేయంపైనా పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. లేక్ విల్లా ఆర్కిడ్ సంస్థ 36ఎకరాల్లో ప్లాట్‌లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సదరు సంస్థ 20 ఎకరాలు మాత్రమే తీసుకుందని నిర్ధారణకు వచ్చారు. డబుల్ రిజిస్ట్రేషన్లపై లేక్ విల్లా ఆర్కిడ్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించనున్నారు.
సంబంధిత కథనాలు