విద్యార్థినిపై ఆ పాఠశాలలో పని చేసే స్వీపరే అత్యాచారానికి(Sweeper rapes student) పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
వారణాసిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సింకు అనే వ్యక్తి స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఈ పాఠశాలకే చెందిన ఓ విద్యార్థిని శుక్రవారం క్లాసులు జరిగే సమయంలో శౌచాలయానికి వెళ్లింది. అక్కడే ఉన్న స్వీపర్ ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఆ విషయాన్ని తల్లిదండ్రులకు దృష్టికి తీసుకురావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్వీపర్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొదని బెదిరింపు