విదేశాల్లో ఉద్యోగం చేయాలని తపన పడ్డాడు ఆ యువకుడు. అమ్మానాన్నలు, తమ్ముడిని బాగా చూసుకోవాలనుకున్నాడు. అందుకే అప్పులు చేసి మరీ... ఓ ఏజెంట్ ద్వారా దేశంకాని దేశానికి వెళ్లాడు. రూ.లక్షలు తీసుకున్న ఏజెంట్ మోసం చేసినా... ఖాళీ చేతులతో తిరిగిరాలేక వేరే ఉద్యోగం చూసుకున్నాడు. కానీ ఆ యువకుడి పట్ల విధి చిన్నచూపు చూసింది. రోజూ పని చేస్తున్న ఆ సముద్రం రూపంలోనే మృత్యువు దూసుకొచ్చింది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు... ఇక తిరిగిరాడనే(suryapet youth died in malaysia ship mishap) వార్తతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
ఏం జరిగింది?
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన రిషివర్ధన్ రెడ్డి అనే యువకుడు ఉద్యోగం కోసం మలేషియా వెళ్లాడు. అక్కడ ఓ షిప్పింగ్ కంపెనీలో కోస్ట్ గార్డ్ ఉద్యోగంలో చేరాడు. తాను పనిచేస్తున్న నౌక లంగర్‌ని తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు సముద్ర నీటిలో పడి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు(suryapet youth died in malaysia ship mishap) కుటుంబసభ్యులకు నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. రిషి మృతిచెంది మూడు రోజులు అవుతున్నా.. మృతదేహం ఇప్పటి వరకు లభించలేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మలేషియా ప్రభుత్వాన్ని సంప్రదించి... మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా కృషి చేయాలని వేడుకుంటున్నారు.
చేదు అనుభవం
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మోటకట్ల వెంకట రమణ రెడ్డి, మాధవి దంపతులకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషిని అతడి అభిరుచితోనే వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ చదివించారు. ఎన్డీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత సాదించకపోవడంతో కేరళకు చెందిన ఓ సంస్థకు చెందిన ప్రదీప్ అనే ఏజెంట్ ద్వారా రూ.ఎనిమిది లక్షలు చెలించారు. అలా మలేషియాకు చెందిన సాలిడ్ లాజిస్టిక్స్ కంపెనీలో వర్క్ పర్మిట్ ద్వారా కోస్ట్ గార్డ్ ఉద్యోగంలో చేరాడు. గత ఫిబ్రవరిలో ఉద్యోగంలో చేరిన రిషికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది.
ఏజెంట్ చేతిలో మోసపోయాడా?
ఉద్యోగం ఇస్తామని చెప్పి... తనతో ఇసుక, కంకర పనులు చేయిస్తున్నారని రిషి అప్పట్లో తల్లిదండ్రులకు చెప్పాడట. దీనిపై సాలిడ్ లాజిస్టిక్స్ ప్రతినిధులను ప్రశ్నించాడని తెలిపారు. అయినా సరైన పని దొరకకపోవడంతో ఏజెంట్ మోసం చేశాడని తండ్రికి సమాచారం అందించాడు. పని మానేసి స్వదేశానికి రావాలని తల్లిదండ్రులు కోరినా... వేరే ఉద్యోగంలో చేరాడు. అక్కడి పరిచయాలతో హ్యాపీలీ నంబర్-1 కన్స్ట్రక్షన్స్కి చెందిన వాణిజ్య నౌకలో పనికి కుదిరాడు.
శోకసంద్రంలో తల్లిదండ్రులు
రోజూలాగే పోర్టుకి వెళ్లే సమయంలో లంగర్‌ని తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి రిషి మృతి చెందినట్లు(suryapet youth died in malaysia ship mishap) సమాచారం ఇచ్చినట్లు అతడి తండ్రి వెంకటరమణ రెడ్డి తెలిపారు. కన్సల్టెన్సీ అజాగ్రత్త, పర్యవేక్షణ లోపంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఇప్పటివరకు కూడా మృతదేహం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు చొరవ తీసుకొని... కనీసం మృతదేహాన్ని అయినా అప్పగించాలని వేడుకుంటున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇక లేడని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఇదీ చదవండి: Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. సూపరింటెండెంట్‌కు మంత్రి కీలక ఆదేశం