Supplies Drugs Gang Arrested: హైదరాబాద్‌లో మరో మత్తుదందా గుట్టు రట్టయ్యింది. హుమాయున్ నగర్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 9 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 8మందితో పాటు 30మంది వినియోగదారులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డార్క్ వెబ్ ద్వారా మత్తుదందా నడిపిస్తున్నారని సీపీ తెలిపారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకున్న వారిపై నిఘా పెట్టామని సీపీ ఆనంద్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు నగరానికి మత్తు పదార్థాలు తీసుకురావాలంటే భయపడుతున్నారని వెల్లడించారు. కానీ, గోవా, బెంగళూరుకు వెళ్లి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ మత్తులో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారని అన్నారు. తల్లిదండ్రులు వారిపై నిఘూ ఉంచాలని సూచించారు.
వినియోగదారుల్లో ఎక్కువ మంది డబ్బు ఉన్న వాళ్ల పిల్లలు ఉన్నారని సీపీ తెలిపారు. వారికి రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా డ్రగ్స్ వాడకుండా చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో ఆరుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న ముఠా.. వాట్సప్ గ్రూపు ద్వారా లావాదేవీలు చేస్తున్నట్లు గుర్తించామని సీపీ ఆనంద్ తెలియజేశారు.
ఇవీ చదవండి: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
శిమ్లా వెళ్లి వస్తుండగా లోయలో పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు.. స్వల్ప గాయాలతో..