నల్గొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిస్తారాయిన్పల్లి ప్రాజెక్టు పరిధిలో నాంపల్లి మండలం లక్ష్మణాపురం గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోంది. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నిర్వాసితులకు పరిహారం అందలేదు.
ఈ క్రమంలోనే లక్ష్మణాపురం గ్రామస్థులు ప్రాజెక్ట్ వద్ద పనులను అడ్డుకునేందుకు వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన సైదులు అనే నిర్వాసితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు వెంటనే బాధితుడి వద్ద నుంచి పురుగుల మందు డబ్బా లాక్కున్నారు. అనంతరం అతడిని మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.