SOT team Raids In Shamshabad: అసలేమైందంటే.. మైలార్దేవరపల్లి పీఎస్‌కు చెందిన బాబా ఖాన్ అనే రౌడీ షీటర్‌పై రౌడీ షీట్ ఎత్తివేయడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ ఆనందాన్ని పార్టీ చేసుకుని స్నేహితులతో ఆనందంగా గడపాలని చూశాడు. కానీ.. తెల్లవారుజామున నర్కుడ గ్రామ శివార్లలో ఉన్న సలీమ్ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి జరపడంతో అతని ఆనందానికి అడ్డుకట్ట వేసినట్లయింది.

పార్టీకి తన స్నేహితులైన నలుగురు యాసీస్, అజర్, సోహైల్ మహబూబ్‌లను ఆహ్వానించాడు. వాళ్లూ పాత రౌడీ షీటర్లు కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని శంషాబాద్ పీఎస్‌కు అప్పగించారు. పార్టీలో పోలీసులు 48 మంది వ్యక్తులను, నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 4 కత్తులు, 5హూట్కా కుండలు 9సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి: