Weapons seized: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో ఎస్‌వోటీ పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. గగన్‌పహాడ్‌లోని హైమద్ ఇంట్లో ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేసి... రెండు తుపాకులు, 30 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
హైమద్‌ను విమానాశ్రయ పోలీసులకు ఎస్‌వోటీ సిబ్బంది అప్పగించారు. పలు పోలీస్‌స్టేషన్లలో హైమద్‌పై 17 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో హైమద్‌పై 17 కేసులు నమోదవగా... గతంలోనూ పీడీ చట్టం కింద జైలుకు వెళ్లొచ్చినట్లుగా గుర్తించారు.
ఇదీ చూడండి: ప్రాణం తీసిన కబడ్డీ.. తలకు బలమైన గాయమై ఇంటర్ విద్యార్థి మృతి