viral news: తమ పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా మంచి అలవాట్లను అలవరచుకోవాలని తల్లిదండ్రులు నిత్యం తపిస్తుంటారు. అలానే వాళ్లు చేసే పనులు మంచిగా లేకపోతే మందలిస్తారు. కొద్దిమంది వారి మాటలు వింటే.. చాలా మంది వాళ్లు తిట్టడం నచ్చక మనస్తాపానికి గురై ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా ఓ తండ్రి అలానే కొడుకును మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు.. తన సొంత బైక్కు నిప్పంటించాడు.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెంలో చోటుచేసుకుంది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై కేక్ కట్ చేయడం ఏమిటని కొడుకును తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన కుమారుడు తన బైక్కు తానే నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా దగ్ధమైంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: విధులకు వెళ్తున్న కార్మికులను ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి
SBIలో బంగారం చోరీకి పక్కా ప్లాన్.. 10 అడుగుల సొరంగం తవ్వి..