Son Attack On Mother: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడులో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లిపై అమానుషంగా దాడి చేశాడు ఓ కుమారుడు. తనకు చెందిన స్థలంలో తల్లి అశ్రబీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టిందని ఆమె కుమారుడు ఈసూబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా తల్లిపై దాడి చేసి.. మరుగుదొడ్డి కోసం నిర్మాణం చేపట్టిన గుంతలో పడేశాడు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను సైతం బెదిరించాడు. కుమారుడు ప్రవర్తనకు నిరసనగా.. అక్కడే అదే గుంతలో తల్లి అశ్రబీ నిరసనకు దిగింది. తన కుమారుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది.
ఇవీ చదవండి:
టెన్త్ క్లాస్ విద్యార్థినిపై కారులో గ్యాంగ్ రేప్
వీడు మాములోడు కాదుగా.. 60 మంది అమ్మాయిలను మోసం చేసి.. రూ.4 కోట్లు కొట్టేశాడుగా!!