Son Attacked On Mother: నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లిపైనే అమానుషంగా దాడి చేశాడు ఓ కొడుకు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శేషు.. వృద్ధాప్యంలో అమ్మ ఆలనాపాలనా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురి చేశాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని రాసివ్వాలంటూ.. భార్యతో కలిసి నిత్యం నరకం చూపించాడు. దెబ్బలకు తాళలేక విలపిస్తున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపకుండా.. కర్రతో చితక బాదాడు.
స్థానికులు ఈ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కర్కశ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: అందంగా లేవని భర్త వేధింపులు.. ఉరేసుకుని భార్య బలవన్మరణం