హైదరాబాద్ పాతబస్తీలో అకారణంగా చిన్న విషయంలో తలెత్తిన గొడవ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ కుటుంబంపై కొందరు దాడికి పాల్పడగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కాలాపత్తర్ పీఎస్ పరిధిలో జరిగింది.
పాతబస్తీ కాలా పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు వాగ్వాదానికి దిగారు. కొందరు వ్యక్తులు ఓ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొనేలోపే నిందితులంతా పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాలాపత్తర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: