ఎన్నో ఏళ్ల నుంచి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ రైతు కలగన్నాడు. దానికోసం ఎంతో శ్రమించాడు. ఎంత కష్టపడ్డా ఇంటికి సరిపడా డబ్బు సమకూర్చలేకపోయాడు. చివరకు అన్నదమ్ముల ఉమ్మడి వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో ఆ కల నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇంతలోనే జరిగిన ఓ సంఘటన.. ఆ రైతుకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ఇంతకీ ఏమైందంటే..
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య తన సోదరులతో కలిసి ఉమ్మడి వ్యవసాయ భూమి అమ్మగా తన వాటా పది లక్షల రూపాయలు వచ్చింది. దాంట్లో ఆరులక్షలు ఇంట్లోని బీరువాలో దాచిపెట్టాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుందామని లక్ష్మయ్య అనుకున్నాడు. దానికి సంబంధించి స్థలం, సామగ్రి, మేస్త్రీ ఇతర పనులన్ని దాదాపుగా పూర్తయ్యాయి. సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందని బేరీజు కూడా వేశాడు. కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.
ఏన్నో ఏళ్ల తన సొంతింటి కల క్షణంలో బూడిదయింది. ఇంట్లో వంట చేద్దామని గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ పేలి(Gas Cylinder Blast) మంటలు వ్యాపించాయి. లక్ష్మయ్యది పూరిగుడిసె అవ్వడం వల్ల మంటలు త్వరగా వ్యాపించి గుడిసె దగ్ధమయింది. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది. ఈ ఘటనలో లక్ష్మయ్య సొంతింటి కోసం దాచుకున్న రూ.6 లక్షల నగదు(cash burnt in suryapet) దగ్ధమయింది. వాటితోపాటే తన సొంతింటి కల కూడా బూడిదైపోయింది.
మంటల్లో(Gas Cylinder Blast) నగదుతోపాటు వ్యవసాయ పాస్బుక్లు, ఎల్ఐసీ పత్రాలు, ఇతర సామగ్రి కూడా కాలిపోయింది. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఇక తన జీవితంలో సొంత ఇల్లు కట్టుకోలేనేమోనని కన్నీరుపెట్టుకున్నాడు.