మంచిర్యాల జిల్లా మందమర్రిలో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్ ఢీకొని సింగరేణి కార్మికుడు మృత్యువాతపడ్డారు. సింగరేణి వర్క్‌షాప్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న సంపత్‌రావు.. యథావిధిగా ఉదయం విధులకు హాజరయ్యారు. విధుల్లో భాగంగా సబ్‌స్టేషన్‌లో పనిచేసేందుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో రెండుకాళ్లు విరిగిపోయాయి. తీవ్రగాయాలైన సంపత్‌ను రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు.
సంపత్‌రావు మృతిపై మందమర్రి ఏరియా జీఎం శ్రీనివాస్‌తో పాటు అధికారులు, కార్మికసంఘాల నాయకులు సంతాపం తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విధి నిర్వహణలో మరణించిన సంపత్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు సింగరేణి ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాయి. ఆదుకుంటామని జీఎం ఇచ్చిన హామీతో కార్మికులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: karvy MD arrest: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టు