ETV Bharat / crime

accident: మద్యం మత్తులో ఒకరి మృతికి కారణమైన ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Jun 28, 2021, 2:13 PM IST

హైదరాబాద్ మాదాపూర్​లో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. కారు నంబర్ ఆధారంగా నిందితులని అరెస్ట్ చేసినట్లు ఇన్​స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్‌ తెలిపారు. నిందితులిద్దరూ మద్యం సేవించి కారు నడిపినట్లు గుర్తించామని వెల్లడించారు.

si f2f, car accident
ఎస్సై రవీంద్ర ప్రసాద్, కారు ప్రమాదం

హైదరాబాద్ మాదాపూర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో సుజిత్‌ రెడ్డి, అతని స్నేహితుడు ఆశిష్​లను కారు నంబర్ ఆధారంగా అరెస్టు చేశారు. గోవాలో ఎంటెక్‌ చదువుతున్న సుజిత్ ఇటీవలే అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

రాయదుర్గంలోని స్నేహితుని ఇంట్లో ఆదివారం జరిగిన విందుకు సుజిత్‌, ఆశిష్‌లు వెళ్లారని తెలిపారు. తెల్లవారేదాకా మద్యం సేవించినట్లు పేర్కొన్నారు. మద్యం మత్తులోనే కారులో నిందితులిద్దరూ బయలుదేరారని చెప్పారు. కారును నడుపుతున్న సుజిత్ రెడ్డి... మై హోం ఆబ్రా వద్ద అతివేగంతో వెళ్లి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టినట్లు వివరించారు.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి సుజిత్‌, అతని స్నేహితుడు ఆశిష్‌ పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై మాదాపూర్ ఇన్​స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఎస్సై రవీంద్ర ప్రసాద్​తో ముఖాముఖి

ఇదీ చదవండి: 51 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.