Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో మరో ఏడుగురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. టోనీని కస్టడీకి తీసుకుని 4 రోజులుగా ప్రశ్నిస్తుస్తున్నారు. టోనీ నుంచి పోలీసులు కొన్ని కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. టోనీ చెప్పిన వివరాలతో మరికొందరు ఏజెంట్లను అరెస్టు చేసే అవకాశముంది. డ్రగ్స్ కేసులో బుధవారంతో టోనీ కస్టడీ గడువు ముగియనుంది.
ముంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల నెట్‌వర్క్ నిర్వహిస్తున్న నైజీరియన్ టోనీని విచారిస్తున్న కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో టోనీ కోట్లు గడించినట్లు దర్యాప్తులో తేల్చారు. అతని వాట్సాప్ చాటింగ్ ద్వారా చాలామందితో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ వాట్సాప్ సంభాషణలన్నీ కూడా డిలీట్ చేయడంతో వాటిని రిట్రైవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
మరోవైపు పంజాగుట్ట డ్రగ్ కేసులో 9 మంది వ్యాపారులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారన్న అభియోగంపై పంజాగుట్ట పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వారిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేయడంతో... పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్‌కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవాల్సినందున వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తీసిపుచ్చింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం
ఇదీ చూడండి: Hyderabad Drug Case: మాదక ద్రవ్యాల కేసులో 9 మందికి బెయిల్