ETV Bharat / crime

50 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుడు అరెస్ట్​ - telangana news

జగద్గిరిగుట్ట పరిధిలోని మహాదేవపురంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పట్టుకున్నారు.

 marijuana smuggling
marijuana smuggling
author img

By

Published : Apr 29, 2021, 10:57 PM IST

మేడ్చల్​ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలోని మహాదేవపురంలో కారులో అక్రమంగా తరలిస్తోన్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. కారుని స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​కు చెందిన సంతోశ్​(27) కారు డ్రైవర్​గా పని చేస్తూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో.. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు నుంచి గంజాయిని హైదరాబాద్​లోని మియాపూర్​కు తరలించేవాడని వివరించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

ఇదీ చదవండి: వ్యక్తి ఆత్మహత్య.. మృతదేహంతో బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.