ETV Bharat / crime

అక్రమంగా నిల్వ ఉంచిన పటిక, నిషేధిత గుట్కా స్వాధీనం

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సలుగుపల్లిలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన పటిక, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్​ఫోర్స్​ పోలీసుల దాడులు
టాస్క్​ఫోర్స్​ పోలీసుల దాడులు
author img

By

Published : May 9, 2021, 9:52 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూరు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పటిక, నిషేధిత గుట్కాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్​లో అప్పగించారు.

బెజ్జూరు మండలం సలుగుపల్లిలో గుడుంబా తయారీలో వినియోగించే పటిక అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. సలుగుపల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 105 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. మరో కిరాణ దుకాణంలో రూ.4,500 విలువ గల నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్​స్టేషన్​లో అప్పగించినట్లు సీఐ రాణాప్రతాప్ తెలిపారు. అక్రమ వ్యాపారాలు చేసినా.. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీచూడండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.