ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతోన్న కారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న 7 కిలోల పుత్తడిని పోలీసులు సీజ్ చేశారు. రూ.3 కోట్ల విలువైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇంత పెద్దమొత్తంలో పుత్తడిని ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి. ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్ల పెంపు... చట్ట సవరణకు త్వరలో ఆర్డినెన్స్