ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్నానంటూ ప్రజలను మోసం చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు భీమయ్య, నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. అధికారుల పేర్లు చెప్పి ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని పలు రకాల మోసాలు చేశారని సీపీ పేర్కొన్నారు.
ఈ తరహాలో ఇప్పటివరకు 82 మందిని మోసం చేసినట్లు గుర్తించామన్నారు. బాధితుల నుంచి రూ. 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 1.03 కోట్ల నగదు, రూ. కోటి విలువ చేసే ఇళ్ల డాక్యుమెంట్లు, ఫార్చునర్ కారు, నకిలీ ఐడీ కార్డులు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని... సుధాకర్‌పై మూడు కమిషనరేట్ల పరిధుల్లో 8 కేసులున్నట్లు సీపీ వివరించారు.
- ఇదీ చదవండి : ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి