నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి ఓ ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ వెళ్తోంది. మెదక్ జిల్లా తూప్రాన్ వద్దకు చేరుకున్న ఆ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం(Rtc Bus Accident) తప్పింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో.. అకస్మాత్తుగా డ్రైవర్ మహబూబ్‌కు మూర్ఛ వచ్చింది. వెంటనే అప్రమత్తమై.. బస్సును రోడ్డు మధ్యలో నిలిపివేశారు.
70 మంది ప్రయాణికులు సురక్షితం..
డ్రైవర్ ముందు జాగ్రత్తతో 70 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అతడి నోటి నుంచి రక్తం రావడం గమనించిన ప్రయాణికులు 108కి సమాచారం అందించారు. సమయానికి వచ్చిన అంబులెన్స్‌లో అతణ్ని ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి :
- Viral Video: సిలిండర్‌కు కట్టి... ఇనుపచువ్వలతో కొట్టి...
- Snake bite: తల్లిదండ్రులు తిడతారని పాము కరిచినా చెప్పని చిన్నారి.. ఏమైందంటే..
" బాన్సువాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాం. తూప్రాన్ వరకు వచ్చిన తర్వాత డ్రైవర్‌కు మూర్ఛ వచ్చింది. ఆయన చాకచక్యంగా బస్సును ఆపారు. ఆయన అప్రమత్తం అవ్వడం వల్లే మేమంతా ప్రాణాలతో బయటపడ్డాం. "
- నర్సింహులు, ప్రయాణికుడు
పెనుప్రమాదం తప్పింది..
అనంతరం అధికారులు.. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి చేర్చారు. చికిత్స అనంతరం డ్రైవర్ మహబూబ్‌ను కామారెడ్డికి పంపించారు. ఈ ఘటన పట్టణంలోని అంతర్గత రహదారిపై జరగడం వల్ల పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అదే జాతీయ రహదారిపై జరిగి ఉంటే.. ప్రాణ నష్టం జరిగి ఉండేదని అన్నారు.