Money seized in private bus: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ. 2 కోట్లు బయటపడ్డాయి. ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం-గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్‌లో తరలిస్తుండగా.. నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు నకిలీవా లేదా అసలా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: KTR Tweet Today: 'అది ఏప్రిల్ ఫూల్ జోక్ అయితే బాగుండేది'