ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి యత్నించినట్లు తితిదే అనుమానం వ్యక్తం చేస్తోంది. శుక్రవారం రాత్రి ఆలయం మూసివేసే సమయంలో ఓ వ్యక్తి లోపలున్నట్లు నిఘా సిబ్బంది భావిస్తున్నారు. ఆలయంలో రెండు హుండీల చోరీకి యత్నించినట్లు అనుమానిస్తున్నారు. గుడిలో అన్ని చోట్ల తాళాలు వేసి ఉండడంతో దొంగ ప్రయత్నం ఫలించలేదు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో అధికారులు, భద్రతా సిబ్బంది ఆలయాన్ని మూసివేశారు. తిరుపతి అర్బన్ పోలీసులకు తితిదే నిఘా సిబ్బంది సమాచారం ఇచ్చారు.
ఉదయం సుప్రభాత సమయంలో అధికారులు తాళాలు తెరిచారు. సీసీ టీవీలో రికార్డయిన విజువల్స్‌ను గుర్తించేందుకు అధికారుల యత్నిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు గోవిందరాజ స్వామి ఆలయాన్ని పరిశీలిస్తున్నారు. ఆలయంలో చోరీ యత్నం జరిగిన ప్రాంతాన్ని సీసీఎస్ డీఎస్పీ పరిశీలించారు. విష్ణు నివాసం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అధికారులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: ఒక్కరే చాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!