వరంగల్ గ్రామీణ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శాయంపేట మండలం మందారిపేట వద్ద... హన్మకొండ నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును... ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Milkha Singh: దొంగతనం ఆలోచన నుంచి పద్మశ్రీ వరకు!