ETV Bharat / crime

accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. తల్లీకుమార్తెలు మృతి - accident in vishaka district

ఏపీలోని విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లీకుమార్తెలు మృతి చెందగా... కారు నడుపుతున్న ఇంటిపెద్ద తీవ్రంగా గాయపడ్డారు.

accident in vishaka district
విశాఖ జిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
author img

By

Published : Jun 17, 2021, 11:46 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తిలో... ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన శ్రీనివాసరావు... తన కుటుంబసభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి విశాఖకు కారులో బయలుదేరారు.

విశాఖ జిల్లా పులపర్తి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో... శ్రీనివాసరావు భార్య, కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న అతను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: Cinema:రిలీజ్​కు సిద్ధంగా 'నారప్ప'.. 'అల అమెరికాపురములో' తమన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.