ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన... వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. మృతులు ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన గుండు ఎల్లయ్య, జోగు సతీశ్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎలుకుర్తి వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రింగ్ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ సీఐ రవికుమార్ ఆందోళనను విరమింప చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
రింగ్ రోడ్డు నుంచి తమ గ్రామానికి దాటే ప్రాంతంలో కనీస లైటింగ్ ఏర్పాటు చేయలేదని... ఇదే స్థలంలో గతంలోను తమ గ్రామస్థుడు ఒకరు మరణించాడని వాపోయారు. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఎల్అండ్టీ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు దాటే ప్రాంతంలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆత్మహత్యకు యత్నించిన మతిస్థిమితం లేని వ్యక్తి