డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. చెన్నై నుంచి దిల్లీకి వెళ్తున్నా కంటైనర్ వాహనం ఘనపూర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే... అదుపుతప్పి రెండు రోడ్ల మధ్యలో వేలాడుతూ ఆగిపోయింది. వాహనంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్ ఇరుక్కుపోయారు. దీంతో అటుగా వెళ్తున్న వాహనాదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... సుమారు ఐదు గంటల పాటు శ్రమించి క్రేన్ సాయంతో వారిని బయటకు తీశారు. ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Corden Search: కూకట్‌పల్లిలో కార్డన్ సెర్చ్.. వాహనాల జప్తు