శేషాచలం అడవుల్లోని అత్యంత అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. మొన్నటిదాకా రోడ్డు, సముద్ర మార్గంలో అక్రమంగా ఎర్రచందనం తరలించిన స్మగ్లర్లు.. ప్రస్తుతం కొత్తదారులను అవలంబిస్తున్నారు. బెడ్ షీట్స్ తరలింపు పేరుతో.. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పార్సిల్ బాక్సులను తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు. వాటిలో ఎర్రచందనం దుంగలు ఉండటంతో అవాక్కయ్యారు. అట్ట పెట్టెల్లో పైన బెడ్ షీట్స్ కప్పి.. వాటి కింద ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారు.
మొత్తం ఐదువందల కేజీల ఎర్రచందనం దుంగలను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. వాటి విలువ మార్కెట్లో పాతిక లక్షకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక కార్యదళానికి సమాచారం అందించారు.
ఇవీ చూడండి: మహారాష్ట్ర గవర్నర్కు చేదు అనుభవం