RAPE ON MINOR GIRL: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అభం, శుభం తెలియని ఓ ఐదేళ్ల చిన్నారిపై.. 32 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి.. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. తమ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కీచకుడిని కఠినంగా శిక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలిక మైనర్ కావడం వల్ల పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
బహిర్భూమికి వెళ్లిన బాలికపై..: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోనూ ఓ ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. పక్కింట్లో ఉండే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. రాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లగా.. నిందితుడు బాలికను లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని మరో బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు చుట్టుపక్కల వెతికారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి..