ETV Bharat / crime

Cyber crime: అందమైన ఫొటోలతో వల.. పోలీసుల చేతికి చిక్కారు ఇలా.. - సైబర్​ క్రైమ్​ పోలీసులు

అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి ​సైబర్​ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్​కు చెందిన పది మందిని నగరానికి తీసుకొచ్చిన సైబర్​ క్రైమ్​ పోలీసులు వారిని రిమాండ్​కు తరలించారు.

cyber crime
cyber crime
author img

By

Published : Jun 28, 2021, 8:38 PM IST

Updated : Jun 28, 2021, 9:16 PM IST

సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎల్​ఎక్స్​ వాహనాలు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ మోసాలకు తెరలేపారు. అలాగే అందమైన అమ్మాయిల ఫొటోలు, న్యూడ్ వీడియోస్ పంపుతూ బ్లాక్​ మెయిల్​ దందా కొనసాగిస్తున్నారు.

రాజస్థాన్​లోని అవెర్​ జిల్లాకు చెందిన పదిమంది ముఠా సభ్యులను పీటీ వారెంట్​పై సైబర్​ క్రైమ్​ పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించారు. గతంలో రాజస్థాన్ పోలీసుల చేతిలో అరెస్టైన ఈ ముఠా సభ్యులు ఇప్పటికే అవెర్​ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.

నగ్న వీడియోలతో బ్లాక్​ మెయిల్

హైదరాబాద్​లో తక్కువ ధరకే వాహనాలను అందిస్తామంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓఎల్‌ఎక్స్‌లో వాహనాలు విక్రయిస్తామంటూ పలువురిని మోసగించినట్లు పేర్కొన్నారు. యువకులకు మహిళల నగ్న వీడియోలు పంపుతున్న ముఠా సభ్యులు వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించిన సైబర్ క్రైమ్ పోలీసులు... రాజస్థాన్​లోనూ సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.

ఇదీ చూడండి: 51 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

Last Updated : Jun 28, 2021, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.