ETV Bharat / crime

protest news: అత్యాచార నిందితుడిని శిక్షించాలంటూ ఆందోళన - తెలంగాణ వార్తలు

అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానికులు ఆందోళనకు(protest news) దిగారు. ఆరేళ్ల బాలికపై శంకర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.

protest news, protest against rape accused
అత్యాచార నిందితుడిని శిక్షించాలంటూ ఆందోళన, ఎల్లారెడ్డిపేటలో ఆందోళన
author img

By

Published : Oct 29, 2021, 5:19 PM IST

ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ... నిందితులను కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ధర్నా(protest news) చేపట్టారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన ఏఎన్ఎం వృత్తిరీత్యా అల్మాస్​పూర్​లోని రైతు బంధు సమితి అధ్యక్షులు రాధారపు శంకర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆరేళ్ల బాలికపై శంకర్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ... గ్రామస్థులతో పాటు, గిరిజన సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఆందోళనకు(protest news) దిగారు.

అల్మాస్​పూర్​లోని శంకర్ ఇంటిపై శుక్రవారం ఉదయం దాడి చేసి... కారు అద్దాలు ధ్వంసం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Chennai NGT News: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధించిన చెన్నైఎన్జీటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.