ETV Bharat / crime

pregnant lady drama : తల్లి కావాలనే ఆరాటం.. 'గర్భిణి' నాటకం - తెలంగాణ వార్తలు

pregnant lady drama: పిల్లల కోసం పరితపిస్తున్న ఆమె ఆ బాధ తట్టుకోలేక తాను గర్భవతినని అందరికీ చెప్పింది. తొమ్మిది నెలల పాటు ఆ నాటకాన్ని కొనసాగించింది.కాన్పు సమయం దగ్గర పడుతుంటే.. ఏం చేయాలో తెలియలేదు. చివరకు బిడ్డను ప్రసవించాక ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది. దీనిపై పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడడంతో అందరూ నివ్వెరపోయారు.

pregnant lady drama
pregnant lady drama
author img

By

Published : Jan 6, 2022, 11:16 AM IST

pregnant lady drama: ఏపీలోని కృష్ణాజిల్లా కొండపల్లికి చెందిన యువతికి ఖమ్మం జిల్లా వైరాకు చెందిన వ్యక్తితో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి సంతానం కలగకపోవడంతో కుటుంబసభ్యులు, పరిసరాల వారు సూటిపోటి మాటలు అంటుండేవారు. వారి మాటలతో మనస్తాపం చెందిన ఆమె... తాను నెల తప్పినట్లు అత్తగారి ఇంట్లో చెప్పి 9 మాసాల కిందట పుట్టింటికి వచ్చింది. ఈ కాలంలో పొట్ట చుట్టూ వస్త్రాలు చుట్టుకుని, ప్రతి నెల వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిక అని చెప్పి వెళ్లేది. ఈ నెల 5న ప్రసవానికి వైద్యులు తేదీ ఇచ్చారని అందరికీ చెప్పి నమ్మించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి తనకు నొప్పులు వచ్చాయని, అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు తనకు కాన్పు చేస్తానని వచ్చి, బిడ్డ పుట్టాక తీసుకెళ్లిపోయారని ఆందోళన చెందుతూ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్‌ కుమార్‌, సిబ్బందితో బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. అనుమానంతో ఆమెను వైద్యపరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్ష చేసి ఆ వివాహిత గర్భవతి కాదని, కాన్పు కాలేదని, అది అంతా నాటకమని నిర్ధారించారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేయడంతో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. అందరూ కుటుంబ సభ్యులు, స్థానికులు అందరూ నివ్వెరపోయారు.

ఇదీ చూడండి: Palvancha Family Suicide: 'నీ భార్యను హైదరాబాద్​ తీసుకొస్తే.. నీ సమస్య తీరుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.