ఏపీ విశాఖ జిల్లా అరకులోయలో కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌తో పాటు 1,150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి బిహార్‌కు కంటైనర్‌లో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించామన్నారు.