Police registered PD Act against ex Maoist Sheshanna: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు మాజీ మావోయిస్టు శేషన్నపై పోలీసులు తాజాగా పీడీ చట్టం నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ..మూడు నెలల క్రితం శేషన్నను పోలీసులు బెదిరింపుల కేసులో అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి దేశవాళి తుపాకీతో పాటు 5 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. నయీంతో కలిసి నిందితుడు పలు బెదిరింపులు, అపహరణలు, హత్య వంటి నేరాలకు పాల్పడ్డాడు.
వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో రాములుతో పాటు మహబూబ్‌నగర్‌లోని ఓ కానిస్టేబుల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకాచారి, చెంచు గోవిందు, పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్, కోనపురం రాములు.. తదితరుల హత్య కేసులో శేషన్న కీలక నిందితుడు. తనపై 11 కేసులున్నాయి. బెదిరింపుల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన అనుచరుడు స్థిరాస్తి వ్యాపారి మహ్మద్ అబ్దుల్లాకు దేశవాళీ తూపాకీతో పాటు అయిదు తూటాలు ఇచ్చినట్టు విచారణలో తెలిపాడు. వరుస నేరాలకు పాల్పడుతున్న శేషన్నపై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పీడీ చట్టం నమోదు చేశారు.
అసలు ఏమి జరిగింది: కొత్తపేటలోని ఓ రెస్టారెంట్లో సెటిల్మెంట్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి శేషన్నని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాల వంటి అనేక కేసుల్లో నయీంతో పాటు శేషన్న కూడా నిందితుడుగా ఉన్నాడు.
ఎవరు ఈ శేషన్న?: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన శేషన్న పదో తరగతి చదువుతుండగానే నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1993లో సనత్‌నగర్ ఠాణా పరిధిలో టాడా కేసులో అరెస్టయ్యాడు. అనంతరం మాజీ ఐపీఎస్ కేఎస్ వ్యాస్ హత్య కేసులో పీటీవారెంట్‌పై పోలీసులు ఆయనను జైలుకు పంపగా.. అక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీంతో శేషన్నకు అనుబంధం పెరిగింది. నక్సల్ ఉద్యమంలో ఉండగానే నయీంతో పరిచయమున్నా, జైలు అనుంబంధం వారిని మరింత దగ్గర చేసింది. బెయిల్‌పై బయటికి వచ్చాక ఇద్దరూ కలిసి పెద్దఎత్తున దందాలు చేశారు.
ఇవీ చదవండి: