మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్ సమీపంలో ఓ అక్రమంగా నల్ల బెల్లం తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.9 లక్షల విలువ చేసే చేసే 110 క్వింటాల నల్ల బెల్లం, ఒక క్వింటా పటికను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బెల్లంను తరలిస్తున్న లారీని సీజ్ చేశారు.
ఒక ముఠాగా ఏర్పడి...
మహబూబాబాద్ మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఈ అక్రమ రవాణ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. వీరు చిత్తూరు జిల్లాలో తక్కువ ధరకు నల్ల బెల్లంను కొనుగోలు చేసి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: జూ.ఆర్టిస్ట్‌గా పనికిరావని విజయ్ సేతుపతిని తిట్టేవారు!