ETV Bharat / crime

Drug Dealer Tony : టోనీ నుంచే పుడింగ్ పబ్​కు డ్రగ్స్

Drug Dealer Tony : రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నైజీరియన్ టోనీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. టోనీ నుంచి కొకైన్ తీసుకున్న హైదరాబాదీయుల్లో కొందరికి పుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులతో పరిచయాలున్నట్లు పోలీసులకు పలు ఆధారాలు లభించాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు.. టోనీ కేసు దర్యాప్తు చేస్తే.. పుడింగ్ అండ్ మింక్ పబ్​కు సంబంధించి కీలక ఆధారాలు బయట పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Apr 19, 2022, 7:50 AM IST

Drug Dealer Tony
Drug Dealer Tony

Drug Dealer Tony : ముంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నైజీరియన్‌ టోనీ నుంచి కొకైన్‌ తీసుకున్న హైదరాబాదీయుల్లో కొందరికి పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులతో పరిచయాలున్నట్టు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నాలుగేళ్లుగా డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్న టోనీ.. గోవా, బెంగళూరు, హైదరాబాద్‌లలోని కొన్ని పబ్బులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడన్న అనుమానం రుజువవడంతో మరిన్ని ఆధారాలపై దృష్టిసారించారు.

బాబూషేక్‌... 'టోనీ కొకైన్‌ను సరఫరా చేసేందుకు ఎనిమిదిమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. ముంబయిలో ఉంటున్న ఇమ్రాన్‌ బాబూషేక్‌ ప్రధాన ఏజెంట్‌. రెండేళ్లుగా బాబూషేక్‌, నూర్‌ మహ్మద్‌ఖాన్‌ తరచూ హైదరాబాద్‌కు వచ్చి సంపన్నులు, పబ్బుల నిర్వాహకులకు కొకైన్‌ ఇచ్చివెళ్లేవారు. మూణ్నెల్ల క్రితం వీరిద్దరి నుంచి 100గ్రాముల మత్తుపదార్థం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టోనీ సహా 22మంది నిందితులు కొకైన్‌ వినియోగం, సరఫరా చేస్తున్నారంటూ అప్పట్లో గుర్తించారు. బాబూషేక్‌ వద్ద ఆ మత్తుపదార్థం తీసుకున్నవారిలో కొందరు తాజాగా పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులకు స్నేహితులవడంతో.. బాబూషేక్‌ నేరుగా పబ్‌కు కొకైన్‌ సరఫరా చేశాడా? నూర్‌తో ఇప్పించాడా?' అనే కోణంలో పోలీసులు పరిశోధిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించనున్నారు. మరోవైపు పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో స్వాధీనం చేసుకున్న 4.64 గ్రాముల కొకైన్‌ ఎలా వచ్చిందన్న విషయాన్ని అభిషేక్‌, అనిల్‌లు తమకు తెలీదనని చెప్పడంతో.. ప్రత్యామ్నాయమార్గాల్లో పరిశోధన కొనసాగించనున్నారు.

విదేశీ పర్యటనలు, ఐపీఎల్‌, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు : పుడింగ్‌ అండ్‌ మింక్‌పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ తాను రెండు, మూడు సార్లు విదేశాలకు వెళ్లానని, క్రీడలంటే ఇష్టమైనందున ఐపీఎల్‌, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి చూస్తానని బంజారాహిల్స్‌ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. డ్రగ్స్‌ వ్యవహారంలో మరిన్ని అంశాలను తెలుసుకునేందుకు పోలీసులు అతడితో పాటు అనిల్‌ను కస్టడీకి తీసుకుని 36 గంటలు విచారించారు.. తనకు డ్రగ్స్‌కు సంబంధం లేదని, ఏడునెలల క్రితమే పబ్‌ను లీజ్‌కు తీసుకున్నానని పోలీస్‌ విచారణలో అన్నట్టు తెలిసింది. చాలామంది ప్రవేశాలు అడుగుతారన్న ఉద్దేశంతోనే ‘పామ్‌’యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ షరతు విధించామని, వ్యక్తిగతం బాగుంటేనే సభ్యత్వం ఇస్తున్నామని వివరించినట్టు తెలిసింది. ఇక నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు అభిషేక్‌, అనిల్‌ను సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి 14రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అభిషేక్‌, అనిల్‌లు దాఖలు చేసిన బెయిల్‌ అభ్యర్థనపై కోర్టు మంగళవారం విచారించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.