పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. నిందితుల నుంచి.. రూ.27 వేల నగదుతో పాటు 4 బైకులు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టణంలోని మైదాన ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న ముందస్తు సమాచారంతో.. పోలీసులు రైడ్ చేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను.. మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఓ వైపు కొవిడ్ విజృంభన కొనసాగుతోన్న.. వైరస్‌కు ఏ మాత్రం భయపడకుండా గుంపులుగా చేరి జూదం ఆడుతుండటం గమనార్హం.
ఇదీ చదవండి: కత్తులతో దాడి చేసి.. బండరాయితో మోది చంపారు