అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారితో మండల స్థాయి తెరాస నేత అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి తెరాస మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ తోటి పిల్లలతో ఆటలాడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనితో భయపడిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.
బాలిక తల్లిదండ్రులు ఈ అంశమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సురేశ్ రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధ్యత గల మండల స్థాయి నాయకుడు ఇలా చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Sexual assault: ఆరేళ్ల చిన్నారిపై... యువకుడు అత్యాచారయత్నం