ETV Bharat / crime

రాత్రికి రాత్రే సులభ్‌ కాంప్లెక్స్‌ మాయం... రూ.45 వేలకు అమ్మకం

Thief Stole Sulabh Complex in GHMC: సఫిల్‌గూడ చౌరస్తాలోని సులభ్‌ కాంప్లెక్స్‌ను రాత్రికి రాత్రి చోరీ చేసి.. తుక్కుగా మార్చి విక్రయించిన దొంగను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 45వేల రూపాయల నగదు, చోరీకి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Sulabh Complex
సులభ్‌ కాంప్లెక్స్‌
author img

By

Published : Mar 22, 2022, 9:43 AM IST

Thief Stole Sulabh Complex in GHMC: మల్కాజ్​గిరి పీఎస్ పరిధిలో సఫిల్‌గూడ చౌరస్తాలోని స్వచ్ఛ టాయిలెట్ ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 45వేల నగదు, ఎత్తుకెళ్లడానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే...

సీఐ జగదీశ్వరరావు, మల్కాజిగిరి సర్కిల్‌ ఉప కమిషనర్‌ రాజు వివరాల ప్రకారం.. సఫిల్‌గూడ చౌరస్తాలోని పాదబాటపై ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ ఈ నెల 16న కనిపించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీసీ రాజు, డీఈ మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని దోమల్‌గూడలో నివసించే మెదక్‌ జిల్లా అందోల్‌ మండలం అమ్మసాగరానికి చెందిన ముప్పారం జోగయ్య(36)గా గుర్తించారు. విచారించగా, జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం ప్రకటనల విభాగంలో పని చేస్తున్న అరుణ్‌కుమార్‌, జైన్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేసే భిక్షపతి సహకారంతో ఈ పని చేసినట్లు అంగీకరించాడు. ఇనుప ఫ్రేమ్‌ను తుక్కుగా మార్చి రూ.45 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుణ్ని రిమాండ్‌కు తరలించి, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:Wife Murder Plan: భర్త హత్యకు ప్రియుడితో కలసి వినూత్న పథకం వేసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.