హైదరాబాద్ కొంపల్లి సినీ ప్లానెట్కు చెందిన ఓ యువకుడికి.. గత నెల 30న వాట్సాప్‌లో గుర్తు తెలియని నంబరుతో సందేశం వచ్చింది. ఎవరా..? అని చూస్తే అటువైపు ఓ లేడీ. ఇద్దరి మధ్య వాట్సాప్ సంభాషణలు ప్రారంభమయ్యాయి. చాట్ అలా సాగుపోతుంటే.. ఆ యువకుడు గాల్లో తేలిపోయాడు. అవీఇవీ మాట్లాడుకుంటున్న క్రమంలో చిన్నగా వ్యక్తిగత వివరాలు, ఫేస్బుక్ ఐడీ అడిగింది. దీంతో ఆ యువకుడు తన ఫేస్బుక్ ఐడీని షేర్ చేశాడు. వారి మధ్య సాగుతున్న చాటింగ్.. కొన్ని ఫోటోలు పంపుకొనే దగ్గర నంచి వీడియో కాల్స్ వరకు అభివృద్ధి చెందింది. అయితే ఇక్కడే ఈ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. వీడియో కాల్స్ కాస్త న్యూడ్ కాల్స్‌గా మారాయి. ముందు తనే అడిగింది కదా అని ఎలాంటి భయం లేకుండా ఈ యువకుడు కూడా మరో అడుగు ముందుకేసి.. న్యూడ్ వీడియో కాల్‌ను ఎంజాయ్ చేశాడు.
బయటపడ్డ అసలు రంగు..
అయితే యువకుడితో జరిగిన న్యూడ్ వీడియో కాల్‌ను ఆ లేడి రికార్డు చేయడం స్టార్ట్ చేసింది. కాల్ పూర్తైన తర్వాత తన అసలు రంగు బయటపెట్టింది. వాటిని తన ఫేస్బుక్లో ఉన్న స్నేహితులకు, కుటుంబసభ్యులందరికీ పంపిస్తానని బెదిరించింది. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితుడు పలుమార్లు కొన్ని నంబర్లకు ఫోన్ పే ద్వారా మొత్తంగా 23,500 రూపాయలను పంపించాడు. అక్కడికి ఆగకపోగా... బాధితుడు విసిగిపోయి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: