ETV Bharat / crime

అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు.. 300 బస్తాలు సీజ్

కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం గుట్టును మక్తల్​లో అధికారులు, పోలీసులు బయటపెట్టారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి దాదాపు 300 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. వీటి విలువ రూ.ఆరు లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

pds rice seized by police and enforcement officers , ration rice seized
రేషన్ బియ్యం పట్టివేత, పీడీఎస్ బియ్యం పట్టివేత
author img

By

Published : May 4, 2021, 9:21 AM IST

రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎన్ని మార్గాల్లో తరలించినా పట్టుకుంటామని నారాయణ పేట జిల్లా ఎన్​ఫోర్స్​మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

మక్తల్ నుంచి ఓ లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు, మక్తల్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. దాదాపు 300 బియ్యం బస్తాలతో ఉన్న లారీని సీజ్ చేశారు. పట్టుబడిన ఈ రేషన్ బియ్యం విలువ దాదాపు రూ.ఆరు లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఇదీ చదవండి: నీళ్లు తాగితే.. ఈ సమస్యలుండవట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.