ETV Bharat / crime

ప్రేమపెళ్లి చేసుకుందని కుమార్తెపై తల్లిదండ్రుల కర్కశం.. ఏం చేశారంటే? - shaved their daughter for love marriage

Parents Shaves Daughter head for Marring Lover : తమ ఇష్టాన్ని కాదని, వేరే యువకుణ్ని పెళ్లాడిన కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరిచి ఆమెను అత్తింటి నుంచి అపహరించారు. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు.

Parents tortured the daughter for marrying for love in Jagtial
ప్రేమపెళ్లి చేసుకుందని కుమార్తెపై తల్లిదండ్రులు కర్కశం.. ఏం చేశారంటే?
author img

By

Published : Nov 15, 2022, 12:29 PM IST

Parents Shaves Daughter head for Marring Lover : తమ ఇష్టాన్ని తోసిరాజని, వేరే యువకుణ్ని పెళ్లాడిన కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరిచి ఆమెను అత్తింటి నుంచి అపహరించారు. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంగా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు. కన్నోళ్లు ఎన్ని హింసలు పెట్టినా కడకు కట్టుకున్నోడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్‌కు చేరింది.. జగిత్యాలలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించిన ఈ అపహరణ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

జగిత్యాల గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి యువతిని అపహరించుకుపోయారు. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు.

సోమవారం జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్‌ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.