Police Drinking Alcohol: సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సి పోలీసే.. తప్పతడుగులు వేస్తే ఎలా? ఇది తప్పు అని చెప్పాలి తప్పా.. తానే తప్పు చేస్తే ఈ సమాజం ఏం నేర్చుకోవాలి? తప్పు చేస్తే దండించాల్సిన పోలీసోడే.. తప్పైపోయిందని ప్రాధేయపడితే ఎలా? ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాల్సిన ఖాకీనే.. కిక్కు కోసం మందేస్తున్నారు.. అది కూడా నడిరోడ్డు మీద పబ్లిక్ చూస్తారనే భయం లేకుండా.. దర్జాగా తాగుతున్నారు.
ప్రతిరోజు డ్రక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి.. వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. మరీ ఈ పోలీసోడే మందు కొడితే.. ఎవరు డ్రక్ అండ్ డ్రవ్ టెస్ట్ నిర్వహించాలి. బహిరంగంగా మందు కొడుతూ.. మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఉంది వారి పరిస్థితి. దొంగను పట్టుకోవాల్సిన రక్షకభటుడు ఇలా దొంగలా ముఖం చాటున పెట్టుకోవడం సమాజం ప్రశ్నించేందుకు దారి తీసింది. వీరు తాగి పడుకుంటే ఎవరు సమాజానికి రక్షణ ఎవరు కల్పిస్తారు. గస్తీ విధులు గాలికి వదిలేసిన ఈ సంఘటన పంజాగుట్టలో జరిగింది.
మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు రాత్రి సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణగా గస్తీ కాస్తుంటారు. అయితే చలికాలం కదా.. బాగా చలిపుట్టిందేమో ఒక చుక్క వేద్దామనుకున్నారు. అన్ని తెచ్చుకున్నారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌పై కూర్చొని.. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు తాగుతున్నారు. ఇంతలోనే ఒకవ్యక్తి వచ్చి వీడియో తీసేసరికి అక్కడే కూర్చున్న కానిస్టేబుల్, హోంగార్డు భయంతో లేచి ఎటువాళ్లు అటు వెళ్లిపోయారు.
వీడియో తీయెద్దు అన్న అని హోంగార్డు ప్రాధేయపడాల్సి వచ్చింది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ అటుఇటు తిరుగుతూ గాబరాగా ఉన్నాడు. ఇలా చేస్తే తాము ఉద్యోగాల నుంచి సస్పెండ్ అవుతామని తెలిసి కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇలా అందరికీ తెలిసే విధంగా చేసుకున్నారు. మూడు రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. కానిస్టేబుల్ సుమిత్, హోంగార్డు వీరయ్యలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దొంగను పట్టుకోవాల్సిన రక్షకభటుడు ఇలా దొంగలా ముఖం చాటున పెట్టుకోవడం సమాజం ప్రశ్నించేందుకు దారి తీసింది. ఇప్పుడీ విషయం డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: