ఏ సమస్యలున్నా పరిష్కరిస్తానంటూ ఓ వ్యక్తి బాబా పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టావాడు. పోస్టింగులు చూసి బాబాకు కొంత మంది కాల్ చేశారు. అన్ని సమస్యలు తీర్చేస్తానంటూ... బాధితుల నుంచి బాబా పైసాలు వసూలు చేశాడు.
డబ్బులు తీసుకున్న తర్వాత బాబా బ్లాక్ మెయిల్‌కు పాల్పడటమే కాకుండా... విషయం బయటకు చెబితే చంపేస్తానని బాధితులను బెదిరించడం ప్రారంభించాడు. బాబా అసలు స్వరూపం చూసిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు... నకిలీ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: కొన ఊపిరితో కొట్టుకుంటుంటే ఏటీఎం పిన్ అడిగాడు!