హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌ను లారీ ఢీకొనగా యువకుని కాలు నుజ్జునుజ్జు అయింది. బహదూర్‌పురా పీఎస్ పరిధిలోని ముస్లయిగూడా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.