నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్త్ నగర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్తున్న కారు... ఉట్నూర్ నుంచి కడెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన సోయం మానుకు అనే వ్యక్తి మృతి చెందాడు.
ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టిన వేగానికి.. ఎగిరి చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న మానుకు అక్కడికక్కడే మృతి చెందాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Road accident: కంటైనర్ ఢీకొని కార్మికుడు మృతి