ETV Bharat / crime

వాహనదారులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి - ఉప్పల్​లో లారీ బీభత్సం

హైదరాబాద్​లోని ఉప్పల్​లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రింగ్​రోడ్డుకి వస్తున్న లారీ ఆగి ఉన్న బైక్​ను ఢీకొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

one person died and three persons injured at road accident in near uppal ring road at rto office in hyderabad
వాహనదారులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి
author img

By

Published : Mar 6, 2021, 3:25 PM IST

ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్​లోని ఉప్పల్​ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది.

one person died and three persons injured at road accident in near uppal ring road at rto office in hyderabad
వాహనదారులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి

ఎల్బీనగర్​ నుంచి వస్తున్న లారీ వాహనదారులపైకి దూసుకెళ్లింది. ప్రధాన రహదారిలో నిలిచిన వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు బైక్‌లు, కారు, ఆటో, డీసీఎం వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సీపీఎం నేత దారుణ హత్య.. భూ తగాదాలే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.