కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం చెరువులో ఈతకోసం దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఐదో తరగతి చదువుతున్న ఆంజనేయులు, బన్నీ నిన్న ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లి మునిగిపోయారు.
గజ ఈతగాళ్లు చెరువులోకి దిగి ఆంజనేయులు మృతదేహాన్ని వెలికితీశారు. మరో బాలుడు బన్నీ కోసం గాలిస్తున్నారు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి: తప్పిపోయిన బాలుడు.. వారం రోజులుగా తల్లిదండ్రుల నిరీక్షణ